| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము |
| వ. | వచ్చి యన్వటవిటపంబు నూఁది యక్కాకంబుల నాలోకించి యంగంబుల యుద్భటత్వం బుడిసికొని గమ నంబు తిన్నఁదనంబు దలకొనఁ జొచ్చి వాని నాక్రమించి. | 17 |
| ఉ. |
కొన్నిటి కంఠముల్ నులుపుఁ, గొన్నిటి కాళులు ద్రుంచు నుగ్రతం గొన్నిటి పక్షముల్ నఱకుఁ గొన్నిటి పొట్టలు వ్రచ్చు లీలమైఁ. గొన్నిటి నప్పళించుకొని కోలెముకల్ నుఱుమాడు, నిట్టు ల య్యన్నిటి నయ్యులూకము రయం బెసఁగన్ వధియించె భూవరా! |
18 |
| వ. | ఇవ్విధంబున నిద్రావివశంబు లైన యవ్వాయసంబుల వివిధంబులగు వధంబుల గీటడఁగించి యా కౌశి కంబు శత్రువులం బొదివి సమయించిన మేటి మగని మాడ్కి మోదంబు నొందినం గని యగ్గురునందనుం డాచందం బొనర్చుటకు డెందంబున నుత్సాహంబు వొడమి పొంగి తనలోన. | 18 |
| తే. |
‘ఇవ్విహంగమ ముపదేశ మిచ్చె నాకు | నిద్రవోవంగ శత్రుల నిగ్రహింతు; నింత లెస్సగునే! ముంద రేమి తెఱఁగు | గాననైతిని నా పూను కార్యమునకు.’ |
20 |
| వ. | అని వెండియు. | 21 |
| ఉ. |
పాండునరేంద్రనందనుల బాంధవ పుత్రయుతంబుగాఁగ ను ద్దండత నే వధింతు నని దర్పమెలర్పఁగఁ గౌరవాధినా థుండు వినంగఁ బల్కితిని; దుర్దమ దోర్చలు లమ్మహాత్మకుల్ గండున బెట్టు పైఁ బడుట కార్యము గాదు తలంచి చూడఁగన్. |
22 |
| క. |
అరవాయి గొనక బెట్టుగఁ | బరిగొని యక్కడిఁది మగలపై నడరుట యు ద్ధురగతి నగ్నిజ్వాలో | త్కరముపయిన్ మిడుత యుఱుకు కరణియ కాదే? |
23 |
| వ. |
పాండవులం బరిమార్చుపని నేఁడ చేయక మఱిచేసిన నారాజు నిర్గత ప్రాణుండైన నాకెలసం బెవ్వరికెక్కడుఁ? జక్కటితోడి బవరంబున నబ్బలుమగల గెలువరాదని యిట్లురియాడు నా చిత్తంబు చింతాపరంపర వాయ నీ పక్షి విచేష్టితంబు లోచనగోచరంబయ్యెఁ బగతురఁ దెగటార్చునెడ నన్యాయంబనక యుపాయం బెయ్యది దొరకొనిన దాన నుత్సహింపవలయుట శాస్త్రసిద్ధంబ కాదే? యెట్లనిన. |
24 |
| తే. |
ఎత్తినప్పుడు, విడియుచో, నిఱకటంపుఁ | దెరువునందు, నడవు సెడి తిరుగఁబడిన యట్టియెడ, నిద్రవోయెడు నవసరమున | శాత్రవుల బెట్టు పైఁబడి చంపవలయు. |
25 |
| వ. | అను నీతివాక్యంబులు విందు; నంగీకృతక్షత్రధర్ముం డగు వానికి నిట్టివి కర్తవ్యంబు; లట్లుఁగాక పాండవేయులు పితామహగురులైన భీష్మద్రోణులఁ దెగటార్చునెడం జక్కటిగల తెఱంగున సంగరంబు చేసిరె? యంగరాజును, రారాజును బరిమార్చిన భంగులఁ దలంపంగూడునె? కావునఁ గల్మషోపాయులగు కౌంతేయుల నిద్రా సమ యంబున గొబ్బున నిగ్రహించుట నీతియ కాని నింద్యంబుగా’ దని నిశ్చయించె; నట్లు క్రూరవ్యవసాయుం డగు నగ్గురుసుతుండు దన మామను, గృతవర్మను మేలుకొల్పి యిట్టి సమయంబున నిద్రించితిమని లజ్జించు చున్న యా రథికవరులతో నిట్లనియె. | 26 |
| సీ. |
‘మొగ దప్పితిమి రణమున మన మకట! ము | వ్వురము; రారాజు నొక్కరునిఁ బాండు తనయులు దమవారుఁ దారును బెక్కండ్రు | గూడి చుట్టును ముట్టి గుల్లపఱచి; రేకాదశాక్షౌహిణీశ్వరుఁ డట్లొంటి | మెయిఁ జిక్కి పోరుచుండియును బాడి దప్పం; డవ్విభుని నధర్మ విక్రమమునఁ | బాపాత్మకుండగు బకవిరోధి |
|
| ఆ. |
గూల్చె; నంతఁ బోక కురుదేశ రాజ్యాభి | షిక్తమైన యతని శిరము దన్నెఁ; బరిభవంబు నొంచెఁ బ్రాణాంతకరవేద | నాతిశయముకంటె నన్నరేంద్రు. |
27 |
| క. |
లావును వెరవును గలుగు మ | హా వీరు లనేకు లట్టు లన్నిదినము లా ‘భూవిభునకై పెనఁగి జయ | మీ వలఁతులు గాకపోయి రే మనవచ్చున్? |
28 |
| ఆ. |
ఎవ్వరెంతఁ జేసిరేనియు విధియొండు | దలఁప నా ఫలంబు దలఁగ కేల యుండు? నిట్లు గాఁగ నున్నది గా; కేమి | యెసకమెసఁగు కౌరవేంద్రు మనుపు?’ |
29 |
| వ. | అని పలుమాటలాడి ‘మీ మది కలంగకున్నదేని యీ మహావ్యసనంబునకుఁ గర్తవ్యం బెద్ది చెప్పవలయు’ నని నఁ గృపాచార్యుండు ధనురాచార్యనందను మొగంబు గనుంగొని ‘నీవు చెప్పఁదలఁచిన యంత వట్టు నుం జెప్పి కార్యం బడిగితేని నాకుఁ దోఁచిన దానిం జెప్పెద విను’ మని యిట్లనియె. | 30 |