| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | స్త్రీపర్వము - ద్వితీయాశ్వాసము |
| సీ. |
పల్కుతప్పమి నెఱపంగఁ దలంచి యు | త్సాహంబు వాటించి సవ్యసాచి దుర్యోధనుండును దొరలు ననేక సై | న్యంబులు నంతంత నడ్డపడఁగ దెరలిచి వడి మెడద్రెవ్వ నేసినఁ బడి | యున్నాఁడు సైంధవుఁ డుఱక ద్రుపద తనయఁ గాననమునఁ గొనిచన్ననాఁడ తాఁ | దెగినాఁడు గాఁడె! కౌంతేయు లపుడు |
|
| తే. |
దయ దలిర్పంగ దుస్సలఁ దలఁచి యలుక | గ్రాఁచి మందలవిడిచిరి గాక దైవ కృతము తప్పింప రాకున్కి కతన నిపుడు | వారు విడిచి రిమ్ముద్దియవలని కరుణ. |
96 |
| తే. |
హృదయమున వగలేనియ ట్టిట్టునట్టుఁ | దిరుగుచున్నది దుస్సల వరుని శిరముఁ గాన కీ కూఁతు నిమ్మెయిఁ గనుట కంటెఁ | దలఁప నెక్కుడు దుఃఖంబు గలదె కృష్ణ! |
97 |
| వ. | నాఁటి రాత్రి యరులు చేసికొనిన ప్రతిజ్ఞ వేగులవారిచేత దుస్సల విని సైంధవునికి బుద్ధి చెప్పిన తెఱంగు లవి వినుము. | 98 |
| సీ. |
విజయు ప్రతిజ్ఞకుఁ ద్రిజగంబులోపల | నడ్డంబులేదు సు మ్మధికుఁ డంటిఁ గురురాజు సైన్యంబు బిరుదు నమ్మకు మంటి | గురుఁడు పార్థునకు మార్కొనఁడ యంటి నరు డాయ నొకనికైనను బుద్ధిగొనదంటి | సమరంబు నీకు నసాధ్యమంటి ధర్మపుత్రుఁడు నిన్ను దయఁగాచుఁ బొమ్మంటి | నామాట వినఁగదె నాథ యంటి |
|
| ఆ. |
రాజతిలక రాజ రాజకంఠీరవ | రాజరత్న దివసరాజతేజ రాజరాజ!’ యనుచు రాజన్యుసైంధవ | రాజుఁ బనవుచుండె నాజిలోన. |
99 |
| తే. |
తోడఁబుట్టువు విధవయై తొలఁగి యునికి | కోర్చి చలమునఁ బతిఁ దెగటార్చి సంత సించితిరె? తండ్రులార! మీరంచుఁ బాండు | పుత్రకుల దూఱుచున్నది పొలఁతి వింటె? |
100 |
| ఉత్సాహవృత్తము |
తనయుఁ గాచుపనికిఁబూని ధర్మపుత్ర వాయునం దనులుఁ గవలుఁ జేయఁ గలుగు దండిమగలు సేనలం గొని వడిం గడంగ సరకుగొనక నిల్చి యొక్కఁడుం బెనఁగి యాఁగె సైంధవుండు బిరుదు దక్షుఁడుంగదే! |
101 |
| తే. |
తప్పు సైంధవుపైఁ బెట్టఁ దగునొ? తగదొ? పార్థు ప్రతినకు నొక్కండ పాత్రమయ్యెఁ దాన యందఱ నాఁగుట తప్పుగాదె? | యదియ సౌభద్రు మృతి హేతు వగుట లేదె? |
102 |
| తే. |
బోరగిలఁ బడ్డవాఁడు గపోలమొకటి | పుడమి మోచినయది మోము పొలుపు సెడదు వీఁడె చూచితె శల్యుండు? వెడలియున్న జిహ్వ దినియెడు వాయస శ్రేణి కృష్ణ! |
103 |
| క. |
ఇట్టవునె? మాద్రితోడం | బుట్టె ననక యితని ధర్మ పుత్రునకుఁ గడుం బెట్టిదుఁడై చంపవలసెఁ | జుట్టపుఁదనమేల రాజ సుతులకుఁ గలుగున్? |
104 |
| క. |
సెల్లుఁడు యమతనయునితో | నెల్ల గుణంబులను జాల నెనయుదు నని తా నుల్లమున నిశ్చయించుం | జెల్లంబో! పోరఁ బగఱచే ని ట్లయ్యెన్. |
105 |
| వ. | అ మ్మహీవిభుండు. | 106 |
| భుజంగ ప్రయాతము |
కురుక్షోణినాథుండు గోరంగ మైత్రిన్ | ధురం దాల్చి తా నేర్పుతో సారథిత్వం బరిశ్రేణిసంత్రాసియై పూని కర్ణుం | బరిక్షోభితుం జేసె భాషాస్త్రపంక్తిన్. |
107 |
| ఆ. |
అధిక పంక పతితమై యున్న యాఁబోతుఁ | బొదివియున్న మొదవు కదుపు వోలె నున్న వారు సూడు మువిదలు దైన్య మా | స్యముల నెలవు కొనఁగ శల్యు బలసి. |
108 |
| మత్తకోకిల |
చూచితే భగదత్తు? నీతఁడు శూరతామహిమన్ నరున్ వీచిసన్నిభబాణపంక్తుల వెఱ్ఱిఁ జేసె మహేంద్రుతో నేచి పోరుబలుండు వోలె సహింప కీతని నిట్లుగాఁ జూచి తాతనిమీఁది నెయ్యము సొంపునన్ మురమర్దనా! |
109 |
| క. |
పులుఁగులును మెకంబులునుం | దొలిచి తినిన నెలవుదప్పి తొలఁగియుఁ గంటే? తల నున్న కనక దామము | పొలుపు దెగం బాయ దీ నృపుం గమలాక్షా! |
110 |