| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | స్త్రీపర్వము - ద్వితీయాశ్వాసము |
| వ. | అని మఱియు నిట్లనియె. | 72 |
| లయవిభాతి |
అరయ నిది పెద్దయని యరుల మొనఁ జిత్తమున | సరకుగొన కుగ్రమగు బరవస మెలర్పం ద్వరితగతిఁ జొచ్చి కురువరుఁడు దలరం గవిసి | కరితతులుఁ దేరులనికరములుఁ దురంగో త్కరములును గాల్బలము నెరవులును గీటడఁగ | శరగురుఁడుఁ గర్ణుఁడును గురుసుతుఁడు మద్రే శ్వరుఁడుఁ గృపుఁడుం బరవ బరఁగి దివిజుల్ వొగడ | ధరఁబడి ముకుంద! మన నరతనయుఁ డొప్పెన్. |
73 |
| ఆ. |
పాడి మాలి తన్నుఁ బలువురు పొదివినఁ | బోరి తద్ద డప్పిఁ గూరి నిదుర పోయెనొకొ సుభద్ర పుత్రుండు! మృతుఁడైనఁ | జెలువ మింత యేల కలుగ నేర్చు? |
74 |
| సీ. |
ఉత్తర యిక్కుమారోత్తము నురమున | వ్రాలి మోమునఁ దనవదనకమల మందంద చేర్చుచున్నది మున్ను గన్నంత | మెలఁగంగనేరక చెలులమాటు గొను సిగ్గు పెంపున వనట నిట్లయ్యె ని | ప్పుడు మాటిమాటికిఁ బొలఁతి ప్రియునిఁ గనుఁగొని బిగియారఁ గౌఁగిలించుచు శిర | మూరుతలంబున నునిచి పాణి |
|
| తే. |
పల్లవంబున నానన మల్లనల్ల | దొడయుచును నిన్నుఁ జూచుచుఁ దోడుతోడఁ బొడము పెల్లునఁ గన్నీరు దుడిచికొనుచు | నలఁత పెనువెల్లిఁ దేలెడు నంబుజాక్ష! |
75 |
| వ. | వింటె యవ్వనిత విలాపంబు? | 76 |
| సీ. |
‘భద్రచారిత్ర! సుభద్రను నిర్జర | ప్రతిమానులగు పాండురాజసుతులఁ బాసి యెం దరిగితి? పార్థుని పట్టి న| చ్యుతుని యల్లుని సమరోర్విఁ జెనసి పరిమార్పఁ జాలిరెవ్వరు? పెక్కుభంగుల | మాటలాడఁగ మఱుమాటలేల యాడవు నాతోడ? నస్త్రగురుండుఁ ద | త్తనయుండుఁ గృపుఁడు రాధాసుతుండుఁ |
|
| తే. |
బాడిమానసులండ్రు నిబ్బాలు నొకనిఁ | బొదివి రిస్సిరొ! పెక్కండ్రు ప్రోడ లిదియు మగఁటిమియె? క్రించుపని కిట్లు దెగినయప్పు | డుల్లములు వారలకు నెట్టులుండె నొక్కొ! |
77 |
| క. |
పాండవులును బాంచాలురు | దండిమగలు వారు సూడఁ దలఁకక నిన్నున్ భండనమునఁ బడవైవఁగ | గండు గలుగు టద్భుతంబు గాదె తలంపన్! |
78 |
| క. |
తనలేనిచోటఁ బలువురు | నినుఁ జుట్టును ముట్టి యొక్కనింజేరి వధిం చిన వంచనకు ధనంజయు | మన మెమ్మెయి నురియునొక్కొ! మన్మథమూర్తీ! |
79 |
| తరలము |
అరుల నెల్లను గెల్చి మేదిని యంతయుంగొని తేజమున్ సిరియుఁ బెంపును గీర్తియున్ విలసిల్లఁగా వినుచుండియుం బురుషసింహులు పాండుభూవరపుత్రు లక్కట! మోదముం బొరయ నేర్తురె? నిన్నుఁ గోల్పడిపోయి పుష్కరలోచనా! |
80 |
| క. |
నీ మూర్తియందుఁ బ్రాణము | లేమిఁ దెలిసియుండఁ జంచలింపక జీవం బేమి కతంబునఁ గలిగియొ | నామేను దొఱంగిపోదు నాథ! యెఱుంగన్. |
81 |
| సీ. |
దేవలోకంబున నీ విప్పుడెవ్వతఁ | దీపారు పలుకులఁ దేర్చి కురులు వుడుకుచుఁ దగ నన్న పోలె లోలాత్మఁగాఁ | జేయుచున్నాఁడవు? చెలువు నేర్పు మెఱయంగ నచ్చర తెఱవల మనములు | గలఁచి యాడుదు గాక యలఁతిఁ బోదె? యంగనాగోష్ఠి నున్నపుడు నా నడవడి | బుద్ధిఁ దలంతె? ని న్బొందఁ గాంచి |
|
| ఆ. |
యాఱు నెలలు వోయె నంతియ యింతియై | కానిలేదె? తొంటి మేనఁ జేసి నట్టి మేలు మోహనాకార యభిమన్యు | వీర నిర్వికార! వినుతసార! |
82 |
| వ. | అను చున్నది యిట్లు పలవింప విరాటనందనం దదీయ జననీప్రముఖ బాంధవస్త్రీ జనంబు లచ్చటువాయం దిగిచి పొగులుచుం గొనిపోయిరి వారలం గనుంగొనుము. | 83 |
| కవిరాజ విరాజితము |
గురుని శరంబులు దాఁకిన మేదినిఁగూలి విరాటుఁడు పేరిన నె త్తురుల మునింగిన మేనును దానును ధూళి సమీరుఁడు మోము పయిం బొరిఁబొరిఁ జల్లఁగ నున్కి గనుంగొని పొడ్మఁగ నశ్రులు హా యనుచుం బురపురఁ బొక్కెద రెమ్మెయిఁ జోపినఁ బోవక మూఁగెడుఁ బక్షితతుల్. |
84 |
| క. |
అకటకట! యుత్తరుఁడు గొం | డొక కాంభోజుండునుం గడున్ బాలుఁడు వా లిక కైదువు లాడిన నే | ల కొఱగి యొప్పి రభిమన్యు లక్ష్మణుల క్రియన్. |
85 |
| సీ. |
పాండుపుత్రుల భుజాబలమున కులుకక | యెవ్వీరు ప్రాపున నెదురు నడచె దుర్యోధనుఁడు గొంతి తొలిచూలి కెవ్వఁడు | హృదయ శల్యంబయి నిదుర సెఱుచు నట్టి కర్ణుండు మదాంధసింధురము బ | లోద్ధత ద్విరద మహోగ్రవిక్ర మమున గీటడఁగిన మాడ్కి నర్జును బలు | గడిమిచేఁ దెగటార్పఁబడియె వీని |
|
| ఆ. |
బాహు విలసనమునఁ బడిన మహాయోధ | వరు లనేకు లితఁ డవార్యరోష భూషితుండు పరుషభాషణశీలుండు | ధైర్యధనుఁడు దానశౌర్యశాలి. |
86 |
| వ. | విను మవ్వీరోత్తముండు. | 87 |
| క. |
పిఱుఁదం గురుధరణీపతి | నఱచేతం బ్రాణములు ఘనారాతి బలం బుఱని తెగువ ముందటఁ బె | న్గొఱలుట చిత్తమునఁ బెట్టికొని విహరించెన్. |
88 |
| తే. |
ఇతని చుట్టును గలకల మెసఁగ రోద | నంబు సేయు పత్నీనివహంబులోనఁ గంటె వృషసేనుతల్లి యగ్గలపుటడలు? మూర్తియైన తెఱంగున నార్తిఁ దూలె. |
89 |
| వ. | ఈ రమణీరత్నంబు ధరణీతలంబునం బొరలుచు. | 90 |
| తే. |
పరశురాముని శాపంబు బాణశక్తిఁ | గ్రాఁప బ్రాహ్మణశాపంబు రథము సిక్కు వఱుప గాండీవధరుచేతి మెఱుఁగుటమ్ము | మన్నిగొనియెనె యో కర్ణ! మగలరాజ! |
91 |
| వ. | అని మఱియుం బలుదెఱంగులం బలవించి యుత్థితయై యాలోకించి. | 92 |
| తే. |
కాకులును గ్రద్దలును దిన్నఁ గడును ద్రెస్సి | యపరపక్షచతుర్దశి యమృతకరుని కరణి నొప్పెడు కర్ణుమొగంబుమీఁద | వనిత యందంద మోపెడుఁ దన మొగంబు. |
93 |
| ఉత్సాహవృత్తము |
వాఁడిమగఁడు నిద్రపోవు వాలుమృగముఁ బోలె నై వీఁడె బాహ్లికుండు వృష్ణివీర! చూడు చచ్చియుం బోఁడి దొఱఁగ కున్నయట్టి పొల్పునన్ వెలింగె వె న్నీఁ డితండు బలము లెన్నియేనిఁ బెల్లు ద్రోచినన్. |
94 |
| తే. |
మేనఁ బ్రాణము వాసినమీఁద మొగము | బొఱసి యుండునె? యెందు నిత్తెఱఁగు కాంతి తోడఁ? బున్నమనాఁటి చందురుని చంద | మమరెఁ జూడు మిక్కురువృద్ధు నాననంబు. |
95 |