| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | స్వర్గారోహణపర్వము - ఏకాశ్వాసము |
| వ. | అని దుఃఖ భార కృపణంబు లగుచు వీతెంచినఁ గౌంతేయాగ్రజుం ‘డోహో! యెంతబెట్టిదంబులైన యిడుమలం బడియెదరో వీర’ లని కారుణ్యం బొలయ నిలిచి, వెండియు నత్తెఱంగు మాటలు విని ‘మీ రెవ్వ?’ రని యడిగినఁ ‘గర్ణుండ భీమసేనుండ నర్జునుండ నకులుండ సహదేవుండ ద్రౌపదిని ధృష్టద్యుమ్నుండ ద్రౌపదేయుల’ మను పలుకు లెసంగుటయు. | 023 |
| సీ. |
ధర్మనందనుఁడు చిత్తమ్మున నుద్వేగ | మావహిల్లఁగ ‘దైవ మకట! యిట్లు సేసెనే? కీ డేమి చేసిరొకో వీర | లిన్నరకమునకు నేఁగుదేర వలసినయట్టిది? వాసవాద్యమరులు | నీచులు వో వీరి నే విచార మించుకయును లేక యిట్టి కష్టపుటిడు | మలఁ బెట్టెడిదె? ధర్మమా! తెఱంగు |
|
| తే. |
మాలితే నీవు సజ్జనమాన్యు లలఘు | సత్యపరులు దయాఢ్యులు నిత్యదాన రతులు బహుదక్షిణాంచిత క్రతువితాన | పావితాత్ము లనర్హంపుఁబాటు వడిరి. |
024 |
| చ. |
ఒకటను మేలు సేయని సుయోధనుఁ డమ్మెయి దేవపూజ్యుఁ డై సకలసుఖానుభూతియు నజస్రము పెంపు వహింప నొప్పి దృ ష్టికిఁ గడు వ్రేఁకనై తనదు చెల్వలుఁ జుట్టలుఁ దాను సంతసం బు కలిమి నేచి మి న్నడిచి పుణ్యపదావృతుఁడై వెలింగెడున్. |
025 |
| ఆ. |
ఈఁగకాలియంత యేనియుఁ బాపంబు | వీరివలనఁ గనుట వినుట గలుగ దొక్కనాఁడు; నట్టి యుత్తములకు విధి | పాడి మాలి యిట్టి పాటు దెచ్చె.’ |
026 |
| సీ. |
అని యగ్గలపుఁజింత మునిఁగి కలంక మ | నోవికారము నాకు నావహిల్లఁ గత మేమి యొకొ! యిది ఘనమాయయో కల | గనుటయో యరయ నిక్కంబొ చిత్త విభ్రాంతిఁ జేసి వివేకింప నేర రా | దయ్యెడు’ నని పరమాకులేంద్రి యుఁడు శోకదుఃఖమయుండు నై కొండొక | ప్రొ ద్దూరకుండి సద్బుద్ధిఁ దలఁచి |
|
| తే. |
యలుక యింద్రుపైఁ బొడమిన నమ్మహాత్ముఁ | డప్పురుషుఁ జూచి మగుడ నీ వరుగు మార్య వర్య! యెవ్వరి దూతవు వారికడకు | ననుచుఁ బలికి వెండియు నిట్టు లనియె నధిప! |
027 |