| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఉద్యోగపర్వము - ద్వితీయాశ్వాసము |
| ఉ. |
భూరికృపానుషంగ! మునిపుంగవ చిత్త సరోజ భృంగ! సం సార దవ వ్రవర్ష! సుర సంస్తుత దివ్య గుణ ప్రకర్ష! దో స్సారనిరస్త దైత్య! శమశాలి మనస్‌స్థితి నిత్య! లోక ని స్తారక శీల! నిర్వృతి విశాల! నిరంజన! పాపభంజనా! |
383 |
| క. |
శ్రుతి మౌళి రత్నమూర్తీ! | శతధృతి ముఖ పద్మ షండ సౌరభ కీర్తీ! రతిపతి హితాహితాక్షా! | సతత సమాచరిత భక్త జన సంరక్షా! |
384 |
| మాలిని |
సదయ విమల దృష్టీ! సంశ్రితాశీః ప్రవృష్టీ! హృదయ కమల వాసా! యిద్ధమాయా విలాసా! విదిత నిఖిల భూతీ! విశ్వరక్షాత్తహేతీ! సదసదుపచితాత్మా! సంభృతానందవర్త్మా! |
385 |
| గద్య. | ఇది శ్రీమదుభయకవిమిత్త్ర కొమ్మనామాత్య పుత్త్ర బుధారాధన విరాజ తిక్కన సోమయాజి ప్రణీతం బయిన శ్రీ మహాభారతంబున యుద్యోగపర్వంబునందుఁ బ్రథమాశ్వాసము. | 386 |