| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము |
| ఉ. |
భక్త మనస్ ప్రమోదకర పాదసరోజ వికాస! చేతనా శక్తిమయ ప్రభావ! ముని సంస్తుత! సాత్యవతేయభారతీ ప్రోక్త! నిగూఢ సంప్రకట భూమ సమాశ్రయ! వత్సలత్వ సు వ్యక్త కృపాభిరామ! గుణ వర్జన! నిష్కల! నిత్యపుష్కలా! |
413 |
| క. |
అవ్యయ నిర్మల విభవా! | దివ్య ప్రభవా! సుఖైక దీప్తానుభవా! నవ్యత్వనిత్య! యతిసం | సేవ్యసుసాంగత్య! లోక జీవన కృత్యా! |
414 |
| మాలిని |
రవిశశి మయనేత్రా! ప్రస్ఫురత్కాంతి హృద్యా! నవ జరఠ వికార న్యాస లీలానవద్యా! వివృత నిగమ శాఖా విశ్రుతాగ్రైక వేద్యా! వివిధ నియత చర్యా విత్త చిత్త ప్రసాద్యా! |
415 |
| గద్య. | ఇది శ్రీమ దుభయకవిమిత్త్ర కొమ్మనామాత్య పుత్త్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబయిన శ్రీ మహాభారతంబున నుద్యోగపర్వంబునందుఁ దృతీయాశ్వాసము. | 416 |