| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | విరాటపర్వము - ప్రథమాశ్వాసము |
| ఉ. |
శ్రీయన గౌరినాఁ బరఁగు చెల్వకుఁ జిత్తము పల్లవింప భ ద్రాయితమూర్తి యై హరిహరంబగు రూపము దాల్చి “విష్ణు రూ పాయ నమశ్శివాయ” యని పల్కెడు భక్తజనంబు వైదిక ధ్యాయిత కిచ్చ మెచ్చు పరతత్త్వముఁ గొల్చెద నిష్టసిద్ధికిన్. |
1 |