| ఇతిహాసములు | మొల్ల రామాయణము | బాల కాండము |
| యాగ రక్షణమునకుఁ రాముని బంపుమని విశ్వామిత్రుని వేఁడికోలు | ||
| సీ. |
ఒక నాఁడు శుభ గోష్ఠి నుర్వీశ్వరుఁడు మంత్రి-హిత పురోహితులును నెలమిఁ జేరి, బంధు వర్గము రాయబారులుఁ జారులుఁ-బరిచారకులు నెల్ల సరవిఁ జేరి, గాయకులును భృత్య గణమును మిత్త్రులు-సతులును సుతులును జక్క నలరి, సరసులుఁ జతురులుఁ బరిహాసకులుఁ గళా-వంతులు గడు నొక్క వంకఁ జేరి, |
|
| తే. |
కొలువఁ గొలు వున్నయెడ, వచ్చి కుశికపుత్త్రుఁ-డర్థి దీవించి, తా వచ్చినట్టి కార్య మధిపునకుఁ జెప్ప, మదిలోన నాత్రపడుచు-వినయ మొప్పార నిట్లని విన్నవించె |
47 |
| క. |
రాముఁడు దనుజులతో సం గ్రామము సేయంగఁ గలఁడె? కందు గదా! నే నే మిమ్ముఁ గొలిచి వచ్చెద నో మునిరాజేంద్ర! యరుగు ముచిత ప్రౌఢిన్. |
48 |
| మ. |
అనినం గౌశికుఁ డాత్మ నవ్వి, విను మయ్యా! రాజ! నీచేతఁ గా దనరా దైనను రాక్షసుల్ విపుల గర్వాటోప బాహా బలుల్, ఘనుఁడీ రాముఁడు దక్క వారి గెలువంగా రాదు, పిన్నంచు నీ వనుమానింపక పంపు మింకఁ, గ్రతు రక్షార్థంబు భూనాయకా! |
49 |
| వ. |
అని ప్రియోక్తులు పలుకుచున్న విశ్వామిత్త్రునకు మిత్త్ర కుల పవిత్రుం డైన దశరథుండు మాఱాడ నోడి యప్పుడు, |
50 |
| క. |
మునినాథు వెంట సుత్రా ముని నలజడి వెట్టుచున్న మూర్ఖులపై రా ముని సౌమిత్రిని వెస న మ్మునితో నానంద వార్థి మునుఁగుచుఁ బనిచెన్. |
51 |