| ఇతిహాసములు | మొల్ల రామాయణము | సుందర కాండము |
| హనుమంతుని విక్రమ విహారము | ||
| సీ. |
మేదిని సమముగా మేడలు గావించి-కేళీ గృహంబుల నేలఁ గలిపి, కమలాకరంబులు కలఁచి గారలు వెట్టి-వృక్ష జాతంబుల విఱుగఁ దన్ని, పుష్ప గుచ్ఛంబులు పుణికి పాఱఁగ వైచి-తేనెలు రాల్చి పూఁ దేనె లుడిపి, పొదరిండ్ల పొడవులు చదియఁగా నుగ్గాడి-చప్పరంబుల నేల చదునుజేసి, |
|
| తే. |
వనముఁ గాచెడి రాక్షస వర్గములను-వీర వరులను, నెనిమిదివేలఁ జంప, సీతఁ గాచెడి రాక్షస స్త్రీలు బెదిరి-పాఱిపోయిరి రావణుపాలి కంత. |
125 |
| వ. | ఇట్లు రావణుం జేరి వారు, | 126 |
| క. |
దేవా# నేఁ డొక మర్కటుఁ డే విధమున వచ్చినాఁడొ యెఱుఁగము, సీతా దేవిఁ గని మాటలాడియుఁ బోవుచు వన మెల్లఁ బెఱికి ప్రోవిడి కడఁకన్. |
127 |
| తే. |
వనముఁ గాచెడి రాక్షస వర్గములను దండి నొకనిని మిడి వోవకుండఁ బట్టి, మేటి భుజశక్తి నందఱ గీటడంచి, వాలి యున్నాఁడు సాహసవంతుఁడగుచు, |
128 |