ఇతిహాసములు మొల్ల రామాయణము సుందర కాండము
మారుతి పిడికిటిపోటుతో యమపురి కరిగిన లంకిణి
క. పోయెడు వాయుజు నెక్కడఁ
బోయెదు నాచేత ననుచుఁ బోనీక వడిన్‌
డాయఁగ వచ్చిన లంకిణి
కాయము వగులంగఁ బొడిచెఁ గడు వడిఁ గినుకన్‌.
223
వ. ఇట్లు లంకిణిం జంపి, సువేలాచలం బెక్కి, సింహనాదంబు సేయుచు, 224
క. పుడమీ ధర శృంగంబున
నడుగులు వడి నూఁది త్రొక్కి, యద్భుత శక్తిన్‌
జలరాశి దాఁటఁ బావని
మిడివింటం బసిఁడి యుండ మీఁటిన రీతిన్‌.
225
వ. ఇట్లు కుప్పించి, యుప్పరం బెగసి, వాయు వేగంబునం జనుచు
నయ్యబ్ధి మధ్యంబున నున్న సునాభం బను శైలంబునఁ దన
దేహంబు దాహంబుఁ దీర్చుకొని, సముద్రంబును దాఁటి, యవ్వలి
కిం జనియె నప్పుడు.
226
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - suMdara kAMDamu ( telugu andhra )