ఇతిహాసములు మొల్ల రామాయణము యుద్ధ కాండము - తృతీయాశ్వాసము
ఆశ్వాసాంత పద్య గద్యములు
క. జలజాక్ష! భక్తవత్సల!
జలజాసనవినుతపాదజలజాత! సుధా
జలరాశిభవ్యమందిర!
జలజాకరచారుహంస! జానకినాథా!
137
మాలిని. కువలయదళనేత్రా! కోమలస్నిగ్ధ గాత్రా!
భవముఖనుతిపాత్రా! భక్తవృక్షాళిచైత్రా!
రవిశశిసమధామా! రక్షితాక్షాంఘ్రిభామా!
కవిజననుతనామా! కావుమా మమ్ము రామా!
138
గద్యము
ఇది శ్రీ గౌరీశ్వర వర ప్రసాద లబ్ధ గురు జంగమార్చన వినోద
సూరి జన వినుత కవితా చమత్కారాతుకూరి కేసనసెట్టి
తనయ మొల్ల నామధేయ విరచితంబైన
శ్రీ రామాయణ మహా కావ్యంబునందు యుద్ధకాండము సర్వంబును దృతీయాశ్వాసము.
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - yuddha kAMDamu - tR^itIyAshvAsamu ( telugu andhra )