కావ్యములు మను చరిత్రము ద్వితీయాశ్వాసము
ప్రవరుఁడు వరూధుని కామనను నిరాకరించుట
ఉ. నిక్కము దాఁప నేల ధరణీసురనందన! యింక నీపయిన్‌
జిక్కె మనంబు నాకు, ననుఁ జిత్తజుబారికి నప్పగించెదో?
చొక్కి మరందమద్యముల చూఱలఁ బాటలువాడు తేంట్ల సొం
పెక్కినయట్టి పూవుఁబొదరిండ్లను గౌఁగిట గారవించెదో?
51
క. అనుటయుఁ బ్రవరుం డిట్లను
వనజేక్షణ! యిట్లు వలుక వరుసయె? వ్రతులై
దినములు గడపెడు విప్రులఁ
జనునే కామింప? మది విచారము వలదే?
52
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - dvitIyAshvAsamu ( telugu andhra )