కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన పంచమాశ్వాసము
సత్య సవతులందఱకు వాయనము లొసఁగుట
చ. తనుతరమధ్య యాగమవిధానము తప్పక యుండ మౌనిచే
ననుమతిఁ గాంచి మ్రొక్కి వినయంబున నందఱ నామతించి క
ల్ప నగముక్రొవ్విరుల్కనకపాత్రములం దగ నించి యిచ్చె వా
యనములు రుక్మిణీ ప్రభృతులౌ సవతు ల్పదియాఱు వేలకు\న్‌.
90
క. ఈచందమున నమానుష
గోచర మహిమాఢ్యుఁడైన గోవిందుని స
త్యాచంద్రముఖీ వరు సుర
వాచంయమి పలికెఁ జతుర వాచాప్రౌఢి\న్‌.
91
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )