కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన పంచమాశ్వాసము
సత్యభామ శ్రీకృష్ణుని మరలఁ గొనుట
చ. అపుడు విరించిసూనుఁడు జనార్దను నెయ్యపు వాలుఁగంటిఁ జూ
చి పడఁతి! నీ మనోహరునిఁ జేకొను మిచ్చెద నంచుఁ బల్కుచో
నపరిమిత ప్రమోద భరితాననయై వెస నిచ్చె వేలుపుం
దపసికి నాత్మభూషణవితానము లన్నియు నిష్క్రయంబుగ\న్‌.
88
క. ఇచ్చి కయికొనియెఁ గ్రమ్మఱ
నచ్చిగురుంబోఁడి విభుని నావైభవము\న్‌
మెచ్చి కురియించి రపుడు వి
యచ్చరు లచ్చెరువుగాఁగ నలరుల వానల్‌.
89
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )