కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన పంచమాశ్వాసము
కవి స్వీయచరిత్ర
సీ. కౌశికగోత్రవిఖ్యాతుఁ డాపస్తంబ - సూత్రుఁ డార్వేల పవిత్రకులుఁడు
నందిసిం గామాత్యునకును దిమ్మాంబకుఁ - దనయుండు సకలవిద్యావివేక
చతురుఁడు మలయమారుత కవీంద్రునకు మే - నల్లుండు కృష్ణరాయక్షితీశ
కరుణా సమాలబ్ధ ఘన చతురంతయా - న మహాగ్రహార సన్మానయుతుఁడు
 
తే. తిమ్మమార్యుండు శివపరాధీనమతి య
ఘోరశివగురు శిష్యుండు పారిజాత
హరణ మనుకావ్య మొనరించె నంధ్రభాష
నాదివాకర తారా సుధాకరముగ.
108
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )