| ప్రాంతీయములకు టిప్పణి |
| పాలు | కౌలు, కోరు |
| పరష | తిరణాల, తీర్థం |
| దస్త్రము | ప్రామిసరీ నోట్ల కట్టలు, 'పది వేల దస్త్రం ఉన్నవాడు' అంటే అతనికి పదివేలు బాకీ లోకులున్నారు. పదివేలు వడ్డీకి ఇచ్చి ఉన్నవాడు అని అర్థము. |
| అలేకార్లు | ఉద్యోగులు, ఆఫీసర్లు |
| మహడీ | మేడ |
| దూము | కలరా |
| దూడవయసు | పసితనం, ప్రాయం |
| రూకలు | రూపాయలు |
| కుమ్మక్కు | ప్రోత్సాహం |
| ఆయకము | తనఖా |
| వఱపు | కఱువు |
| కణజం | ధాన్యం పోసేవి |
| పాతర | ధాన్యం నిల్వచేసే నేలమాళిగలు |
| జీవాలు | గొఱ్ఱెలు, మేకలు |
| బొట్టు | కానీ |
| కొట్టము | పాక |
| లోటా | పంచపాత్ర, గ్లాసు, టంబ్లరు |
| మిరపగింజలు | మిరియాలు |
| గవినీళ్ళు | కొండలో చెలిమనీళ్లు |
| పిన్న పెద్ద | పెద్దమనిషి, కలావ త్రవ్వే వారికి పెద్ద |
| సిల్వరు | అల్యూమినమ్ |
| మడక | నాగలి |
| చక్కరోలు | బజారులో ఉన్న చిన్న కఱ్ఱ రోలు |
| పైనిమిరి | వళ్ళు రుద్ది |
| పై | ఒడలు, శరీరము |
| మట్లు | నిలువులు |
| మెట్లు | సోపానాలు, మెఱికలు |
| ఔతుఖానా | స్నానాలగదిలో నీళ్ళు నిల్వజేసేందుకు గారతోకట్టిన పెద్దతొట్టి |
| మున్నూరు | మూడువందలు |
| పుట్టి | చిన్నతెప్ప |
| గౌరి | వీథి |
| బసివి | బసుపురాలు, ఊరిలోని దేవదాసీ లాంటిది |
| ఎనుము | గేదె |
| ఆకు | కన్నప్పుడు చక్కపెడతారు, ఆకు యిస్తారు, వేడికల్గించే వ్యాధి నివారణ చేసే ఔషధి |
| ఆకుమూట | పై పంచకొసన ఆకు, వక్క, పొగాకు, సున్నం వగైరాలు కట్టుకున్న మూట |
| మాలపున్నమ | మహాలయ అమావాస్య |
| కట్లపొడి | పొగాకు కాడలుదంచి పెట్టిన పొడి, ఆకు వక్కలతో కలిపి ఆడవాళ్ళెక్కువగా వేసుకుంటారు |
| కనుమ | కొండదారిలో కొండదాటే యిరుకుదారి |
| పరువు | రెండున్నర మైలు |
| అంబటివారు | యింటిపేరు (వైశ్యులు ముఖ్యంగా) |
| తనకలాట | బాధ |
| ముంతెడు | రెండు తవ్వలు |
| మామ | మగడు, ఈ వర్గాలలోనే ఎక్కువగా ఈ అర్థంలో ఉపయోగిస్తారు |
| నల్తుము | నాలుగు తూములు |
| వల్లె | పంచ |
| పై దిరుగు | వళ్ళు తిరుగుడు, కండ్లు తిరుగుడు |
| పొంత | ప్రొయ్యిప్రక్కనే మంట తగులునట్లుగా పెట్టిన బాన |
| సందకాడ | సందెకడ, సాయంకాలం |
| నాల్నాళ్ళు | నాలుగు రోజులు |
| బాకీ | అప్పు |
| మామూలు | ఇనాము, ప్రతి పండుగకో పర్వానికో ఇచ్చే బహుమతి |