కవితలు విష్ణుధనువు (శిష్‌ట్లా ఉమా) విజయ మహేశ్వరము

మాటకు మాటాను మాటల అర్థం ఉండాలి. ఉంటుంది! సమాసాలు సందర్భానుసారంగా కొంత వదులుతో ఫరవాలేదు!

వ్యాకరణంతో వ్యభిచరించటము కూడదు కాని, Poetryలో కొంత స్వేచ్ఛ అవసరం! న్యాయం!

రమ్యత అనేది రంజింప చేయుట అనేది కావ్యానికి ముఖ్యము. రమ్యత అనగా ఎరుపు పచ్చనరంగులు గల రామచిలుకవలె భావమూ, రసమూ సరసగా కనబడుచూ - కలిగించుటే!

నిజానికి ఇవన్నీ Philologyకీ అలంకార శాస్త్రానికీ సంబంధించిన విషయాలు. ప్రత్యేకంగా పరిశీలించేవి. తత్వశాస్త్ర విషయాలూ అంతే! గాన ... ప్రస్తుతం! ఈ పుస్తక ముద్రణము విషయమున

పూలపల్లి వెంకటవల్లభాచార్యులు
వేదాంతం పూర్వానందం
ఫణిహారం రామమూర్తి
మిత్రులైన కారణాన ఈ బృందమునకీ గ్రంథమును ఆపేక్షతో అంకిత మిస్తున్నాను!

- విజయ మాహేశ్వరము

తెనాలి,
ఫిబ్రవరి 14, 1938

AndhraBharati AMdhra bhArati - kavitalu - viShNudhanuvu - (SiSh.hTlA umA) vijaya mahESvaramu Shishtla Umamaheswara Rao - Sishtla Umamaheswara Rao - kavitalu kavitvaM geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - telugu kavita - tenugu andhra ( telugu andhra andhrabharati telugu literature )