కవితలు బసవరాజు అప్పారావు గీతాలు 110. కవరు
110. కవరు
కవరు వచ్చిందంటె
గంపంత ఆశతో
కాలు విరిగేటట్లు
గప్పుమని గెంతాను.
కాని ఆ కవరులో
కంసాలి వ్రాసినా
కంగాళి వుత్తరం
కళ్ల జూచేసరికి
పొంగిపోయిన మనసు
కుంగిపోగా అట్టె
కుర్చీలో సిగ్గేసి
కూలబడి నవ్వాను.
AndhraBharati AMdhra bhArati - kavitalu - basavarAju appArAvu gItAlu - 110. kavaru - basavarAju appArAvu geetaalu - Basavaraju Appa Rao - Basavaraju Apparao geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )