కవితలు బసవరాజు అప్పారావు గీతాలు 071. కవి జీవితము
71. కవి జీవితము
కవి యని కీర్తిని
గాంచుట కన్నను
ఘన మే మున్నది
    జగతిన్‌?
కష్ట సుఖమ్ముల
చవి జూచుటకన్న
మృష్టాన్నం బెటు
    రుచిరా?
వలపుమంట మ్రిం
గు కన్న హాలా
హలము మ్రింగు టెటు
    గొప్పరా?
ప్రణయవేదనల
పాడుట కన్నను
పరమామోదం
    బెదిరా?
మృత్యు వైభవము
కీర్తించుటకన్న
నిత్యానందము
    కలదే?
ఆనందలోక
మరయుట కన్నను
కానని సౌఖ్యము
    కలదా?
సౌందర్యోపా
సనమున కన్నను
సద్వ్రత మెయ్యది
    చెపుమా?
భావిశాశ్వతము
జీవించుకన్న
జీవితఫల మిం
    కెదిరా?
AndhraBharati AMdhra bhArati - kavitalu - basavarAju appArAvu gItAlu - 071. kavi jIvitamu - basavarAju appArAvu geetaalu - Basavaraju Appa Rao - Basavaraju Apparao geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )