కవితలు బసవరాజు అప్పారావు గీతాలు 145. ప్రేమరాజ్యము
145. ప్రేమరాజ్యము (ఉమర్‌ఖయ్యామ్‌)
లోకముతో మన కేటికి లోలాక్షీ! రా పోదము!
జీవితంపు సంతసమ్ము జెరిపి వంత గూర్చుపాడు
లోకముతో మన కేటికి, లోలాక్షీ! రా, పోదము.
సరసమౌ వసంతభాగ్యగరిమ మిగుల నుల్లసిల్లు
నడవులందు పండుఫలము గుడిచి మనము తనివిదీర
విచ్చినమందారపూల యచ్చమైన తేనెగ్రోలి
మచ్చమైకమొంది మేను మరచిపోయి తమకమ్మున
చెవికింపగు నాదముతో సెలయేఱులు శ్రుతివేయగ
చివురుటాకుబోలువ్రేళ్ళ చెలియ! నీవు వీణె మీట,
సొక్కి జంతుజాలము విన, సొడల నన్ని పాఱదోలి
చేతనున్న విమలభావగీతపు పొత్తమ్ము విప్పి
శ్రవణపేయ ప్రణయగీతి చవులూరగ నేను బాడ
కానన మే స్వర్గసీమకన్న సౌఖ్యమౌగదె! యీ
లోకముతో మన కేటికి, లోలాక్షీ! రా పోదము.
AndhraBharati AMdhra bhArati - kavitalu - basavarAju appArAvu gItAlu - 145. prEmarAjyamu - basavarAju appArAvu geetaalu - Basavaraju Appa Rao - Basavaraju Apparao geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )