కవితలు బసవరాజు అప్పారావు గీతాలు 021. విరహము
21. విరహము
ఏడ తిరుగాడెదవు కృష్ణా!
        ఈ
    వాడకే రావైతి కృష్ణా!
నీపైని మోహమున కృష్ణా!
        నే
    నిలువవలేకుంటిరా కృష్ణా!
కాల్చుచున్నది జ్వరము కృష్ణా!
        నా
    కాలుసేతులు వడకు కృష్ణా!
ఆస లడుగంటెరా కృష్ణా!
        ఆ
    యాసమున బలముడిగె కృష్ణా!
బాలభానునియట్ల కృష్ణా!
        నీవు
    వచ్చి న న్నలరింపు కృష్ణా!
వదనకాంతులు జిమ్మి కృష్ణా!
        నా
    పరితాప మార్పరా కృష్ణా!
AndhraBharati AMdhra bhArati - kavitalu - basavarAju appArAvu gItAlu - 021. virahamu - basavarAju appArAvu geetaalu - Basavaraju Appa Rao - Basavaraju Apparao geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )