| కవితలు | దాశరథి కవితలు | అగ్నిధార |
| 1. జయభారతీ! | |
|
ఓ జనతా! నతాంజలి పుటోజ్జ్వల దివ్య కవోష్ణ రక్తధారా జలసిక్త పాద కమల ద్వయ శోభి మనోజ్ఞ దేహరేఖా జయభారతీ! యుగ యుగమ్ముల పున్నెపుపంటవీవు నీ పూజకు తెచ్చినాడ నిదె పొంగిన గుండియ నిండు పద్దెముల్ | |
|
జండా ఒక్కటె మూడు వన్నెలది; దేశంబొక్కటే భారతాఖండాసేతు హిమాచలోర్వర; కవీట్కాండమ్ములోనన్ రవీంద్రుం డొక్కండె కవీంద్రుండు; ఊర్జిత జగద్యుద్ధాలలో శాంతికోదండోద్యద్విజయుండు గాంధి ఒకడే, తల్లీ! మహాభారతీ! | |