కవితలు దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి 18. ఏమగునో
18. ఏమగునో
ఏ మగునో యిక నాబ్రతుకు
ఎటు చూచిన దరియే కనరాదు        ॥ఏ॥
ప్రేమరత్న మీపేద కొదవునని
యీ మహాబ్ధి లోతెరుగక వెడలితి
ఏమగునో యిక నాబ్రతుకు
సాంద్రజలదముల జంఝానిలముల
సాగుచున్న దీ సాగరయానము
దారి చూపు నాతారయె మెరయదొ
చేర లేనొ సుఖజీవనతీరము
ఏమగునో యిక నాబ్రతుకు
AndhraBharati AMdhra bhArati - kavitalu - dIpAvaLi - 18. EmagunO - gautamI kOkila vEdula satyanArAyaNa Sastri ( telugu andhra )