| కవితలు | దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి | 19. కలువ |
| 19. కలువ | |
| చీకటుల పాలేన యీకలువ బ్రతు కింక సోకదా నీ సుధాశ్రీకరమ్ముల చలువ ॥చీకటుల॥ రేకురేకుల విరిసి నాకె బరువగు నెడద వాక లగు తేనియల వలపు గాలికిఁ బోవ చీకటుల పాలేన యీ కలువ బ్రతు కింక | |
| కొస మొదలు గనరాని మసక చీకటిరేయి ముసరి మూగిన కారుమొయిలు కొనల దాటి మెఱుగుకన్నులఁ గురియు చిఱునగవు వెన్నెలల మరగు నాయెద జల్లబరుప రానే రావా! చీకటుల పాలేన యీ కలువ బ్రతు కింక సోకదా నీ సుధాశ్రీకరమ్ముల చలువ | |