కవితలు దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి 41. చకోరిక
41. చకోరిక
ఈ చకోరికకు ఎన్నడొ పున్నమ
ఈ చెర విడి యెపు డెగిరి సుఖించునొ
ఆకులపడి రె క్కార్చు చూర్చుచును
శోకతిమిరకృశయై కలవరపడు
ఈ చకోరికకు ఎన్నడొ పున్నమ
ఈ చిరవిరహ మ్మెపు డవసన్నమొ
శీతామృతచంద్రాతపమున, నవ
జీవనపులకితయై, విసు వెరుగక
ప్రేమగాన మొనరించుచు, చిరసుఖ
సీమవిహారము సేయ నాశపడు
ఈ చకోరికకు ఎన్నడొ పున్నమ
ఈ చెర విడి యెపు డెగిరి సుఖించునొ!
AndhraBharati AMdhra bhArati - kavitalu - dIpAvaLi - 41. chakOrika - gautamI kOkila vEdula satyanArAyaNa Sastri ( telugu andhra )