కవితలు దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి 25. జ్వాల
25. జ్వాల
ఊరు పూర్పునఁ దూగాడు నూర్ము లరసి
తరగతరగ వినం బడు తానము విని
నురుగునురుగున చుక్కల మెరుగు గాంచి
యాట యని, పాట యని, హాస మని తలంచుఁ
గాని, యీ మహాసాగరాగాధహృదయ
బాడబానలజ్వాల యెవ్వరికిఁ దెలియు?
AndhraBharati AMdhra bhArati - kavitalu - dIpAvaLi - 25. jvAla - gautamI kOkila vEdula satyanArAyaNa Sastri ( telugu andhra )