కవితలు దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి 43. నీకోసమే
43. నీకోసమే
కోసుకొనుమ యీ కోమలకుసుమము
కోరి విరిసె నీ కోసమె స్వామీ!
తేనెల సోనలు తీరకమునుపే
తీయనివలపులు మాయకమునుపే
కోసుకొనుమ యీ కోమలకుసుమము
కోరి విరిసె నీ కోసమె స్వామీ!
విడిన రేకుగమి వడలిపోవునో
తొడిమ వీడి పెనుధూళిని రాలునొ
చెడునో వికసించిన మధుశోభలు
ఒడల పులకరిం పొదవగ నిపుడే
కోసుకొనుమ యీ కోమలకుసుమము
కోరి విరిసె నీ కోసమె స్వామీ!
AndhraBharati AMdhra bhArati - kavitalu - dIpAvaLi - 43. nIkOsamE - gautamI kOkila vEdula satyanArAyaNa Sastri ( telugu andhra )