| కవితలు | దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి | 13. నిరసనము |
| 13. నిరసనము | |
| విరిగి సమయుటే ఫల మని యెరిగికూడ దరి నెనయఁ బాడుచును బోవు కెరటమట్లు ఘోరమరణాంతక మ్మనుకొనియుఁ గూడ వేగిపోవు నాబ్రదుకు నీ ప్రేమకొరకె | |
| నన్నుఁ బ్రేమించువారి యానందమునకు నేను విడువలే దొక్క యూర్పైనగాని నన్ను నిరసించు నీ చిరునవ్వుకొరకె బ్రతుకు వెలిగించి వలపునివాళి యిడితి | |
| రాతిబ్రదు కెంచుకొని యహోరాత్రములును ఱెప్ప వాల్పని తిమిరయాత్రికుఁడ నేను పంట బరువున వ్రాలిన పైరువోలె కోఁతకై చూచుచుంటి నీ కోర్కె దీర్ప | |