| కవితలు | కాంచన విపంచి - శ్రీమతి చావలి బంగారమ్మ |
21. ఆదర్శము |
| 21. ఆదర్శము |
|
ఆకుపైనొకపక్షి ఆకాశమునపక్షి ఒకటితొనొకటేమొ వరుసమాటలుజెప్ప వల్లంత సిగ్గాయెనే నాగుండె ఝల్లంటు చెడిపోయెనే ఆకుపైనాపక్షి యట్టెచూచుచునుండ ఆకాశమునపక్షి యటజేరి యొకమాట అట్టెజెప్పీ పోయెనే అదిచూడ హా! యన్న తలపాయెనే ముక్కుముక్కునజేర్చి ముచ్చటలు దెల్పుచు రెక్కలను సవరించు చక్కన్ని ఆజంట ఆనందమును గూర్చెనే జన్మకది ఆదర్శమనిపించెనే |