| కవితలు | కాంచన విపంచి - శ్రీమతి చావలి బంగారమ్మ |
22. ఆరాధన |
| 22. ఆరాధన |
|
నిన్నుబోలిన దాననంచును నివ్వెరా బడిపోయినావ? చివ్వునను తెల్లారురోజులు రివ్వున\న్ రావ? ఏదియోచన చేయుచుంటివె ఎవరి నారాధించు చుంటివె ఏదె నీలక్ష్యంబు చెప్పుము సాదరంబుగను ఎంతసేపిటు వేచియుండెదె వింతదోచెను నిన్నుజూడగ చింతతోడనె నాకుతోడై చెంత నీవుంటన్. |