కవితలు కాంచన విపంచి
- శ్రీమతి చావలి బంగారమ్మ
23. ఉదయిని
23. ఉదయిని

ఆగండి చుక్కలూ
ఆగిచూడండి
ఇదిగొ నాపసికూన
    అగపడద మీకంటి
        - కాగండి
పాకుచూ నాబాల
పైడికాంతులు జల్ల
పలుతెరంగుల పూలు
    పరిమళించుచునుండె
        - ఆగండి

బడుగైన నాకడుపు
భావాలు విరబోయ
భయమేల "నుదయిని"తో
    భాస్కరుని జూడగా
        - ఆగండి
AndhraBharati AMdhra bhArati - kavitalu - 23. udayini - kAMchana vipaMchi - Kanchana Vipanchi - chAvali baMgAramma - Chavali Bangaramma geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )