కవితలు కాంచన విపంచి
- శ్రీమతి చావలి బంగారమ్మ
అంకితము
అంకితము
ఆప్త బంధువులు - రాసిక్యసింధువులు
పెండ్యాల అనసూయా - విశ్వనాథశర్మ దంపతులకు

ఎడలేని రేకుగా
విడినట్టి పసిడి తా
మరల కోనేటిలో
మురియు నంచలు మీరు!
ఈ విపంచీగాన
మెద నిండగా మెచ్చి
పరతెంచినట్టి కి
న్నర జంపతులు మీరు!!
ఈ తావి పొద పారి
జాతాలు విరియింప
తెనుగు తోటలకు వ
చ్చిన శచీంద్రులు మీరు!!!
మీకోస మీవన్నె -
మీకోస మీగీతి -
మీకొరకె యీతావి -
చేకొనుడు దంపతుల్‌!
- చావలి బంగారమ్మ
AndhraBharati AMdhra bhArati - kavitalu - kAMchana vipaMchi - Kanchana Vipanchi - chAvali baMgAramma - Chavali Bangaramma geeyamulu gEyAlu - aMkitamu - Ankitamu Ankithamu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )