| కవితలు | కాంచన విపంచి - శ్రీమతి చావలి బంగారమ్మ |
16. చెలి యెడబాటు |
| 16. చెలి యెడబాటు |
|
మాతోటియాడేటి మాచిన్నిచెలియా! మగనితో అత్తింటి కేగుచున్నావ? మరలనెప్పుడు వచ్చెదవె మమ్ముజూడ మగనిజూచినకండ్ల మముమరువకుండ మా బొమ్మపెళ్ళికీ మరల వచ్చెదవా? మముజూచుకోర్కెలే మరచియుండెదవా? ముసిముసీనగవుల మురిపెములమూట మగని సిగ్గునజూచు మనసైనయాట మగనితో నొంటరిగ మాటాడుపాట మదిపొంగుచూ నాటలాడేటిమాట లీపూట చవిజూడగలవె నామాట లాపాటునను నీకు ఈపాటతెలుపు కాంతరో కోపించి కనులెర్రజేసి కఠినముగ జూడకే కాంత నాబొమ్మ ఘనమైన ఈమాట గమనించి వినుమ కనుకొసనుజూడు మాకనకంపు బొమ్మ |