| కవితలు | కాంచన విపంచి - శ్రీమతి చావలి బంగారమ్మ |
2. దండ |
| 2. దండ |
|
చుక్కలన్నీచూసి చక్కనివితీసి ఒక్క దారముతెచ్చి వరుసగాగుచ్చి దాయి దాయినితీసి దండలోగుచ్చి దండ చూసుకు నేను దండమెడతాను నక్షత్రముల దండ నామెడనువుంటె నలుగురూ నను జూచి నవ్విపోతారు నక్షత్రముల దండ నాథుమెడనుంటె నలుగు రాతని జూచి నవ్వుకుంటారు ప్రక్కప్రక్కల బోయి పరికించుతారు చక్కన్నివాడంచు చాటిచెపుతారు నక్షత్రముల దండ ఎవరిదంటేను నాదోయి నాదియని నలుగురంటారు అడిగినంతనె యిచ్చునా అందరికిని అడుగకుండనె యిచ్చు అతివ నాకతడు. |