| కవితలు | కాంచన విపంచి - శ్రీమతి చావలి బంగారమ్మ |
3. మనకేల? |
| 3. మనకేల? |
|
కో అంటె తెలిసింది కోవెల్లకూత కా అంటె తెలిసింది కాకమ్మకూత కాకి కోవెల లొక్క కాంతినున్నాయి కంఠములు మాత్రమే కలియలేదమ్మ కోవెల్లకూసితే కొసరి వింటారు కాకమ్మకూసితే కసరి కొడతారు కోవెల్ల మీకేమి కోరితెచ్చింది కాకమ్మ మీకేమి కాన్కలీలేదు కోవెల్ల పాటకే కొండెక్కుతారు కాకమ్మ గంతునూ గమనించరేమి కోవెల్ల కూతలకు కునుకులేపోవు కాకమ్మ గంతులను కన్నులేచూచు కోవెల్ల కూసితే కోయిచ్చుతారు కాకమ్మ గంతిడితె గజ్జెలిస్తారు కాకి కోవెలల కే కయ్యములు లేవు మనకేలనమ్మ యీ మాయకయ్యములు? |