కవితలు కాంచన విపంచి
- శ్రీమతి చావలి బంగారమ్మ
19. దైన్యము
19. దైన్యము
ఆకాశమున మబ్బులల్లుకొన్నాయి
అయ్యొ! నామనసల్లె అవియేమిచెప్ప!
సూర్యునీ రాకకై చూచు సృష్టెల్ల
ననుబోలినద? నే దానిబోలితిన?
అంతరిక్షమునందునాడు పక్షుల్లు
అవిచూడ నామనసు ఆశలైతోచు
వింతగావిడిపోవు నామబ్బుచూచి
పంతమాయని గుండె పగిలిపోయింది
ఆ మబ్బువీడుచో నాదిత్యుడొచ్చు
నా మబ్బువీడదే నాథుండురాడే.
AndhraBharati AMdhra bhArati - kavitalu - 19. dainyamu - kAMchana vipaMchi - Kanchana Vipanchi - chAvali baMgAramma - Chavali Bangaramma geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )