| కవితలు | కాంచన విపంచి - శ్రీమతి చావలి బంగారమ్మ |
18. సహనం |
| 18. సహనం |
|
కొమ్మపై కోవెలా కూయుటామాని పాపాయిపాట విని ఫక్కున్ననవ్వె పాపమ్మ నీపాట బాగున్నదమ్మా నీముందు నేనింక పాడలేనమ్మా నీవు నేనూకలిసి పాడుతూ ఉంటె ఈ పేటవారలకు ఇకపాటలేవి? పాటలెరిగిన మనము పాడుతూ ఉంటె మాటలెరిగినవారు మాటాడగలర? మాటల్లు మనకేల పాటలేగాని పాటలెరిగినవార్కి మాటలేలమ్మ పేటవారలమాట పాటించకమ్మ వాటమెరిగీ పాట పాడవోయమ్మ మనవారిమాటలకు మనకేల వులుకు మనపాటలకు నేడు మాధవుడు కులుకు. |