| కవితలు | కాంచన విపంచి - శ్రీమతి చావలి బంగారమ్మ |
9. నివేదన - 6 |
| 9. నివేదన - 6 |
|
ఇదియేమి యని నాథుడిట్టె ననులేప త్రుళ్ళిపడి నేనతని కళ్లజూచితిని పణతి నాబాహువులు పతికంఠసీమ బంధించి యుండుటది బహువింతదోచె అతనిజూడగ సిగ్గు అధికమై తోచె కథను జెప్పగ నాకు కదలదే పెదవి అదను జిక్కినదంచు హాస్యమాడగను వదనంబులో నేను వంచింపబడితి నేను గాంచిన వెల్ల నాలోన గలసె చూచుచుండినదెల్ల శూన్యమనిపించె నా నాథులో నేను లీనమైనానె అతడొక్కడె నిజం బఖిలంబు కల్ల. |