| కవితలు | కాంచన విపంచి - శ్రీమతి చావలి బంగారమ్మ |
27. కార్తిక |
| 27. కార్తిక |
|
పున్నమీరోజయిన బోనిచ్చినాడా? ఒక్క ప్రొద్దయిన నన్నుండనిచ్చాడా? ముచ్చటలతో ప్రొద్దు పుచ్చుమన్నాడు పున్నెమంటేయిదే పుడమినన్నాడు నిన్విడిచి నేనుండ నిముసమన్నాడు నన్విడిచియుందువా నోములన్నాడు తానె చంద్రుడంట నేనె వెన్నెలయంట ఈనాడు నా చంద్రుడేవాడ నున్నాడొ |