| కవితలు | కాంచన విపంచి - శ్రీమతి చావలి బంగారమ్మ |
4. నివేదన - 1 |
| 4. నివేదన - 1 |
|
ఆదిమధ్యాంతముల అమరినదేవ అతని హృదయమును నన్నలుముకోనీవ అండ పిండములలో నుండేటిదేవ అతని గుండెలలో నన్నుండగానీవ సమవర్తివనియేటి స్వామివీవేగ సమముగా ననుజూడ స్వామిశలవీవ ఇంట నన్విడిచి తానొంటిగాబోయి జంటకోసము వెతక ధర్మమంటోయి ఆకలిబాధచే అవనిలోనేను అత్తచే జిక్కుటలు అతనికైకాద అన్నపానీయముల కాశించలేదు అతని దయకోసమే ఆశించినాను మనసులో భావాలు మణగిపోకుండ అరచేత దీయుమని అతనితోజెప్పు చూపులో భావాలు స్రుక్కిపోకుండ చూడరమ్మని జెప్పు సూర్యుడా! పోయి. |