| కవితలు | కాంచన విపంచి - శ్రీమతి చావలి బంగారమ్మ |
5. నివేదన - 2 |
| 5. నివేదన - 2 |
|
నాడు పోయితివయ్య నేడు వచ్చితివి నీజాడ లీలోన నేజూడలేదు వేకువనె లేచేవు వేళకొచ్చేవు వెళ్ళివచ్చిన పనుల్ ఏమిచేశేవు వాడ వాడల దిరుగు వాడవనికాద వేడితిని విభునిటకు తోడికొనిరాగ ఏ కడను జూచితివి ఏమిచెప్పితివి ఏ చెవిని విన్నాడు ఏమనన్నాడు మరియాదగా నీతొ మాటాడినాడ మఱువకను నామనవి మదినుంచుతాడ పాటించి నీమాట బాగుగావినెనా బోసినోటిమాట తోసిరాజనెనా మతిచెడక మనవలెనె మసలుతున్నాడ స్థితిచెడక తనులేచి తిరుగుతున్నాడ మతిదిరిగి మనకొఱకు మరలివస్తాడ పతిజూచు భ్రమవీడి బ్రతుకుమన్నాడ? |