| కవితలు | కాంచన విపంచి - శ్రీమతి చావలి బంగారమ్మ |
6. నివేదన - 3 |
| 6. నివేదన - 3 |
|
చూచివచ్చిన మాట తేటపడగాను నోటజెప్పుట నీకు చేతకాదనుము చురుకు గల చూపులతొ సూర్యుడా! నీవు చూడలేవైతివా సున్నితపు విభుని మనసు మెత్తనివాడు మహమంచివాడు మాటాడ వెరతురూ మనబోటివారు మగువలకు భయమన్న మరినమ్మవచ్చు మగవారికేలయ్య మాటాడభయము మగవారికైననూ మాటలాడుటకు మనసు తెలుపని వాని మరులేలతిరిగె పగలె పరికిస్తావు పారిపోతావు చీకటిని జూచితే చిక్కుతాడేమొ కునికిపాటున నీవు కునుకుతావేమొ కుముదబాంధవునైన కూకలెట్టుమను. |