| కవితలు | కాంచన విపంచి - శ్రీమతి చావలి బంగారమ్మ |
7. నివేదన - 4 |
| 7. నివేదన - 4 |
|
అమవాస మన్నాడు అంపితిని కబురు సూర్యదేవుడు నిన్ను చూచి చెప్పేడు వింటివా నాకథను విపులమ్ముగాను కంటివా నారూపు కనులారగాను ఈరీతినున్నాను ఇనునిచే నేను ఏసాయమును పొందజాలకను నిన్ను ఎటులైన తోడితెమ్మని వేడినాను నిన్ననే విన్నావు నేడు వచ్చేవు నీవలెనె మావాని తోడితెచ్చేవ అతిశీఘ్రముగ నీవు అతనికడకేగి అమృతమొలికేటట్టు లతనితోజెప్పి మతివిరిచి స్థితిచెరిచి తీసికొనివచ్చి పతిగూర్చి ఈపుణ్యఫల మందుమయ్య నూరుకల్లలు పల్కి ఒకయిల్లు నిల్ప లోకోక్తి కలదయ్య నీకేలచెప్ప! |