కవితలు కాంచన విపంచి
- శ్రీమతి చావలి బంగారమ్మ
8. నివేదన - 5
8. నివేదన - 5
ఆనాడుచెప్పేను ఈనాటికైన
అతడేమిచెప్పెనో అది తెలియదాయె
వస్తాడు పోతాడు వరుసగా తాను
వొక్కనాడైన తా వచియింపడాయె
ఇలనుండువారిలో నెవరి వేడుదును
ఈశ్వరునివేడనా యింపు గూర్పగను
ఇద్దరూ పెళ్ళాల ఇరుకునున్నాడు
ఇంపు గూర్చుటకు తన సొంపేమికలదు
మాంగల్యగౌరు నీమహిమ జెప్పెదవా
మగడు విడకుండగా మైకమిచ్చితివా?
అతనిలో నిమిడినా అర్ధరూపిణివి
అతనిపొందగలట్టి అనుభవంబేమి
పతిప్రేమ బడసిన భాగ్యశాలివనా
పలుమారు పిలిచినా బలుకకున్నావు
సర్వేశ్వరుడు నిన్ను సరసనేయుంచి
సరసమా గంగనూ శిరసునుంచేడు
తలనున్న గంగకై తపము సేయుచును
పలవించుచున్నాడె పంచాక్షరములు
ఇంతమాత్రమునకే యింతిగర్వించి
సంతసింపగవలెనె స్వాంతమ్ములోన?
AndhraBharati AMdhra bhArati - kavitalu - 8. nivEdana - 5 - kAMchana vipaMchi - Kanchana Vipanchi - chAvali baMgAramma - Chavali Bangaramma geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )