| కవితలు | కాంచన విపంచి - శ్రీమతి చావలి బంగారమ్మ |
25. పాప |
| 25. పాప |
|
మాపాప చెంబులో నీళ్ళొలక బోసితే చెందురుడు జారిపడి చిందు లాడేడు చేయెత్తి మాపాప చెడ మొత్తినాది మరికొంత సేపటికి మనసు నొచ్చింది పాపనేమనలేక పారిపోయేడు పాకొచ్చి పాపాయి పడకజేరింది కసితీర తానొచ్చి కళ్ళబడ్డాడు నీకింతె యని పాప నిదురబోయింది మరల నేడొచ్చునో మరి రాడొ నేనెరుగ. |