| కవితలు | కాంచన విపంచి - శ్రీమతి చావలి బంగారమ్మ |
31. రాధ - 3 |
| 31. రాధ - 3 |
|
చినుకు చినుకులబోలు చిన్నిపూదేనె పలుకుతో తనుగూడ పయనమౌచుండు తలపుమడతలుచెప్ప తగునంచు తామె తల్లడిల్లుచునుండు తనదు కన్నుల్లు భరమైన యా మోహబంధంబు ద్రెంప తరమౌనె తనకైన మరపౌను కాని తపియించి నన్ను తా జపియించలేద తన్నన్న ఫలమేమి తలవ్రాతగాని కాలంపు మార్పుతో కాలుజారినది దానితోకూడ జపమాల జారినది ఆనాటి తలపుతో అతనినీ దలచి అవనిపై నాతనువు అట్టె వ్రాలినది |