| కవితలు | కాంచన విపంచి - శ్రీమతి చావలి బంగారమ్మ |
32. రాధ - అనుబంధము |
| 32. రాధ - అనుబంధము |
|
తనగుండెలోనేను తలదాచుకొన్నట్టి తలపు మదిలోజేరి తెలివితప్పిందేమొ తలతిప్పుతున్నాడటే నాకిపుడె తెలిసింది అన్నాడటే తొడపైని తలయుంచి తొణకనీయక మోము తొలినాటి ఆచూపు చిలుకరించిన ప్రేమ కలలోన గన్నాడటే తానట్టె తెలియలేదన్నాడటే ఆశించి తనలోన ఐక్యమందగ గోరు పాశంబుతోసి నను మోసగించిన మాట దోసమని యెంచాడటే ననుజూడ ఆశించు చున్నాడటే |