| కవితలు | కాంచన విపంచి - శ్రీమతి చావలి బంగారమ్మ |
33. రాధ - వేదన |
| 33. రాధ - వేదన |
|
ననువిడిచి తనుపోవు తోవలో గనుపించు నేలపూసిన గడ్డిపూవులో గూడతను రాగమే చూచునటవే నాకు అనురాగమే చూపడటవే ... అణువునై నేనతని యండనే యుండగా నన్నుకాదని తాను నెమకులాడుచు బోయి రాగమే చూచునటవే నాకు అనురాగమే చూపడటవే ... సోలుతూ తానేమొ పూలతోటకు బోవు తోవవెంటనె కంటికాలువై నే బోవ రాగమే చూచునటవే నాకు అనురాగమే చూపడటవే ... ధూళిలో నేనుంటి నీళలో నేనుంటి ఈ రెండులేకనే ఇట పూలుపూసెనా రాగమే చూచునటవే నాకు అనురాగమే చూపడటవే ... |