| కవితలు | కాంచన విపంచి - శ్రీమతి చావలి బంగారమ్మ |
34. రాధ - ప్రణయనింద |
| 34. రాధ - ప్రణయనింద |
|
అణువణువులో తనే అవతరించినయట్టి కనులలో దుమ్మోసి తనువు దగ్ధముచేసి తానెట్టు పోయినాడో నాహృదయ దాహంబు తీర్పరాడో? చూచినా తనె కన్ను మూసినా తనె నిజము చూడలేకనె నేను నిలువలేకున్నాను తానెట్టు పోయినాడో నాహృదయ తాపంబు మాన్పరాడో? మాటలేకనె నేను మందంబుగానుండ డెందంబులో నీడ చిందులాడగజేసి తానెట్టు పోయినాడో నాకంటి తడియైన ఒత్తరాడో? |