| కవితలు | కాంచన విపంచి - శ్రీమతి చావలి బంగారమ్మ |
35. రాధిక |
| 35. రాధిక |
|
నాగుండెలోనబడి నలిగిపోయినవాని నయనంబులోనుండు నడకమార్పులుచూడ నగలు కావలెన నాకు విలువైన వలువ కావలెన నాకు? వెనుక జూచినజాలు కినుక మానినజాలు పలుతెరచి నాతోడ పలుకకుండిననేమి కనుపించితే చాలదా తనమాట వినిపించితే చాలదా? ఇష్టమే లేకున్న కష్టమే తనకున్న నిష్ఠురములయిన నే నిష్ఠతోవింటాను సృష్టిలో తనుగానిది ఏదైన దృష్టిలోనికి వచ్చునా? ప్రక్క నుండియుతాను పరుగువారినగాని పరిమళించకపోన మరుగునుండినప్రేమ పరులతో జెప్పగలనా నాలోన ప్రవహింపకే మానునా? |